గ్రామఅభివృద్ధికి పనిచేస్తా ఆశీర్వదించి ఓటెయ్యండి
వంగర నవంబర్ 25 మేజర్ న్యూస్పం చాయతీ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే గ్రామ ప్రజలకు అండగా ఉంటామని ఓని అగ్రహారం సర్పంచ్ అభ్యర్థి ఆవు చంద్రశేఖర్ అన్నారు. గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ తనను గెలిపిస్తే. నిజాయితీ తో కూడిన పాలన అందిస్తానని, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామాన్ని తీర్చిదిద్దుతానని. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని.గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని.. తనకు కేటాయించిన మంచం గుర్తుకు చిహ్నంగా ఎన్నికల్లో గెలిపిస్తే ఐదేళ్లు కాలం లో గ్రామంలో జరిగిన ఆడపడుచుల వివాహం సమయంలో డబుల్ కాట్ మంచం పెళ్లి కానుకగా అందిస్తానని ఆయనఅన్నారు.ఇది ఎన్నికల తాయిలం కాదని, మా ఊరి ఆడపడుచుకి అన్నగా నిలవాలన్నదే నా ఆకాంక్ష అని ఆయనవెల్లడించారు.