BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

ప్రజాక్షేత్రంలో అడ్రస్ లేని వైసీపీ నామినేషన్ తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకం

Select Suryaa Now
ప్రజాక్షేత్రంలో అడ్రస్ లేని వైసీపీ నామినేషన్ తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకం

ప్రజాక్షేత్రంలో అడ్రస్ లేని వైసీపీ నామినేషన్ తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకం

 

• మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై చింతమనేని ధ్వజం

ఏలూరు, మేజర్ న్యూస్:

దెందులూరు నియోజకవర్గంలో కూటమి ప్రభంజనం ముందు నిలవలేక, ప్రజాక్షేత్రంలో అడ్రస్ గల్లంతైన వైసీపీ.. ఇప్పుడు నామినేషన్ల తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకాలకు తెరలేపిందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.... ఉన్న కార్యకర్తలు సైతం పార్టీ వీడి వెళ్లకుండా కాపాడుకోవడానికి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తప్పుడు ప్రచారాలు, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సత్తా ఉంటే తాను విసిరే బహిరంగ సవాల్‌ను స్వీకరించాలని అబ్బయ్య చౌదరికి సవాల్ విసిరారు.   ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం లోని 75 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 8 చోట్ల మాత్రమే గెలిచిన వైసీపీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోందని ఎమ్మెల్యే  ఎద్దేవా చేశారు. కూటమి అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో వైసీపీకి పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారని, ఆఖరికి కొన్ని పంచాయతీల్లో ఒకే కుటుంబం నుంచి 7–8 మందితో నామినేషన్లు వేయించారంటే ఆ పార్టీ దుస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.కనీసం ఇంటి పన్ను బకాయిలు కట్టకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారనే కనీస పరిజ్ఞానం లేని వారితో నామినేషన్లు వేయించి, నిబంధనల ప్రకారం అధికారులు వాటిని తిరస్కరిస్తే “అక్రమంగా తొలగించారు” అంటూ అబ్బయ్య చౌదరి మాట్లాడటం చూసి అటు అధికారులతో పాటు ఇటు ప్రజలే నవ్వుకుంటున్నారని చింతమనేని విమర్శించారు. 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించి, ఇప్పుడు తమ కార్లపై దాడులు జరిగాయంటూ అబ్బయ్య చౌదరి సింపతీ డ్రామాలాడుతున్నారని, నిజంగా దాడి జరిగితే ఒక్క ఫోటో అయినా బయటపెట్టాలని సవాల్ విసిరారు. అబ్బయ్య చౌదరి పదేపదే ప్రస్తావిస్తున్న భోగాపురం, అప్పనపాలెం, కొప్పాక, జగన్నాథపురం, గార్లమడుగు గ్రామాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి అభ్యర్థులతో రాజీనామా చేయిస్తానని, మళ్లీ ఎన్నికలకు వెళ్దామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు. ఆ ఐదు గ్రామాల్లో వైసీపీ ఒక్క స్థానం గెలిచినా తాను తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న తన కుమార్తెతో రాజీనామా చేయించి మళ్లీ పెదవేగి జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయిస్తానని, దమ్ముంటే అబ్బయ్య చౌదరి ఈ సవాల్‌ను స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. నియోజకవర్గంలోని 85 గ్రామ పంచాయతీల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని, పల్లెల ప్రగతి కోసం ప్రజలంతా కూటమి అభ్యర్థులకే పట్టం కడతారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.