కొల్లాయి వలస సర్పంచ్ పీఠం వందనాలకు విజయం వరించే నా..
పూసపాటిరేగ, నవంబరు 25, మేజర్ న్యూస్: మండలంలోని మారుమూల పంచాయతీ అయిన కొల్లాయివలస పంచాయతీ తాజాగా జరగనున్న ఎన్నికల్లో వందనాల అప్పలరాజు కే విజయం వరిస్తుందన్న ఆశలు రేకెత్తిస్తున్నాయి. గతంలో ఈ పంచాయతీ మారుమూల పంచాయతీ కావడంతో మౌలిక సదుపాయాలతో పాటు కనీస సౌకర్యాలు కూడా కాన రాలేదు. దీనితో విద్యావంతుడు, యువకుడు అయిన వందనాల అప్పలరాజు జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సహకారంతో రెండున్నర ఏళ్లగా పంచాయితీకి కనీస సదుపాయాలైన తాగునీరుతో పాటు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ కాలువలు డ్రైనేజీలు వంటి వాటిని కల్పించే విధంగా అప్పలరాజు కృషి చేయడమే కాకుండా పంచాయతీలో ఉన్న నిరక్షరాస్యలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వ పథకాలు కూడా అంతే విధంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అదే స్ఫూర్తితో తాజాగా జరగనున్న పంచాయతీ త్రిముఖ పోటీలో అప్పలరాజు పోటీ చేయడమే కాకుండా తాను చేసే సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. నామినేషన్ రోజును కూడా అప్పలరాజుకే మొగ్గు చూపుతూ వాటర్ లో భారీ సంఖ్యలో మద్దతు తెలుపుతూ అప్పలరాజుకు జై కొట్టారు. కొల్లాయి వలస పంచాయితీలో కొల్లాయి వలస తో పాటు శివారు గ్రామాలైన మరియు పేట, మత్స్కార గ్రామమైన పులిగడ్డ పాలెం గ్రామాలు ఉండగా మొత్తం 1491 మంది ఓటర్లు ఉన్నారు. అయితే అప్పలరాజు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా పంచాయతీలో సింహభాగం యాదవ వర్గానికి చెందిన వారే అత్యధిక మంది ఉండడం విశేషం. తర్వాత తెలగా, రెడ్డిక, ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఉండడంతో అప్పలరాజుకు ప్రత్యర్ధులుగా నరసన్న తో పాటు రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన రామస్వామి పోటీలో ఉన్నారు. గతంలో చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని, యాదవ సామాజిక వర్గం తో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా తనకే పట్టం కడతారన్నవిశ్వాసాన్ని అప్పలరాజు వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో పాటు మెజార్టీ కూడా అదే స్థాయిలో వస్తుందన్న ఆశాభావాన్ని అప్పలరాజు వ్యక్తం చేస్తున్నారు.