వికలాంగుడు ఖాదర్ భాష కుటుంబాన్ని దత్తత తీసుకున్న ఆనం కైవల్యా రెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని కొలగాని రామయ్య ధర్మ సత్రం ప్రాంతంలోని కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద మైనారిటీ షేక్ ఖాదర్ బాషా అనే వికలాంగుడి కుటుంబాన్ని పి 4 పథకం ద్వారా రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యా రెడ్డి దత్తత తీసుకున్నారు. రామనారాయణరెడ్డి శనివారం సాయంత్రం ఈ కాలనీలో పర్యటించి అక్కడ సమస్యలన్నింటిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాదంలో వికలాంగుడుగా మారిన ఖాదర్ బాషా అక్కడకు చేరుకొని తన దయనీయ పరిస్థితిని మంత్రి రామ్ నారాయణ రెడ్డికి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి కుమార్తె తెలుగుదేశం నాయకురాలు ఆనంద్ కైవల్యారెడ్డి ఖాదర్ బాషా కుటుంబాన్ని తాను పి4 పథకం ద్వారా దత్త తీసుకుంటానని పేర్కొన్నారు. ఖాదర్ భాషా కు ట్రై సైకిల్ ఏర్పాటు చేస్తానని, ఆయన ఇద్దరు బిడ్డల విద్యాభ్యాసానికి తాను బాధ్యత తీసుకుంటానని అక్కడ పాల్గొన్న అందరి కరతాల ధ్వనుల మధ్య కైవల్యా రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి,తాళ్లూరి గిరినాయుడు,తుమ్మల చంద్ర రెడ్డి, చల్లా రవికుమార్ రెడ్డి, దాసరి మధుసూదన్ రావు,మాజీ కౌన్సిలర్ పొడమేకల పెంచలయ్య యాదవ్, 14వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి పచ్చిపాల హరిత,ఐదవ వార్డ్ మున్సిపల్ కౌన్సిల్ టిడిపి అభ్యర్థి నాయబ్ రసూల్ (చిన్న), కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.