విజయోత్సవ ర్యాలీలపై నిషేధం!
అడ్డరోడ్డు పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ రామకృష్ణ
ఎస్. రాయవరం, నవంబర్ 6, మేజర్ న్యూస్:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మండలాల్లో విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు అడ్డరోడ్డు లోని నక్కపల్లి పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఎల్.రామకృష్ణ తెలిపారు.
అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు, సభలు నిర్వహించినా, బాణసంచా కాల్చినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.