andhrapradesh
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
నగరం, మేజర్ న్యూస్:
నేటి బాలలే రేపటి పౌరులని చదువుతోపాటు క్రీడలు, ఇతర రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండల పరిధిలోని ఈదుపల్లి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల డైరెక్టర్ యోనా బాబు అన్నారు. శనివారం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తొలుత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు