విద్యార్థులకు అన్నదానం చేసిన నిత్యసురభి ట్రస్ట్
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్, పుట్టినిల్లు ఆశ్రమం చైర్‌పర్సన్ డాక్టర్ ఎస్. నిర్మలమురళి ఆధ్వర్యంలో కోవూరు నగర్‌లోని ఎయిమ్ ఫర్ సేవ, శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మలమురళి మాట్లాడుతూ అనాథలు, నిరాశ్రయులు ఒంటరివారమనే భావనను వీడి, సమాజం తమకు అండగా ఉందనే నమ్మకంతో సంతోషంగా ఉండాలని అన్నారు. కార్తీక మాసంలో సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో పుణ్యప్రదమని, ప్రతి ఒక్కరూ తమకు వీలైనంతగా ఆపదలో ఉన్నవారికి సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో స్వామి సత్యాత్మానంద, మేనేజర్ చక్రపాణి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..