BREAKING
రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ భారత్‌ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు: ఒకప్పుడు రిజెక్ట్ చేసిన బ్రాండ్‌కే అంబాసిడర్‌గా ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు మరణం తర్వాత స్వర్గం దొరుకుతుందనే ఆశతో మనిషి జీవితాంతం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎవరో ఉపవాసం ఉంటారు, ఎవరో దానధర్మాలు చేస్తారు, ఎవరో తీర్థ యాత్రలు చేస్తారు, మరి కొందరు దేవుడికి మొక్కులు మొక్కుతారు. స్వర్గం ఏదో కొత్త హౌసింగ్ సొసైటీలా ఉంది, అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కోసం పుణ్యపు పాయింట్లు జమ చేయాల్సిన అవసర ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు డీఎస్ ఆశయాలు కొనసాగిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్ నిమజ్జనంకు సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు - పోలీస్ కమిషనర్ వెల్లడి తెలంగాణకు మరో ఆణిముత్యం.. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌కు ఆకుల అక్షిత ఎంపిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ - కొల్వాయి లిఫ్ట్ వద్ద కాలిన మోటార్లు  పునరుద్ధరణ వల్లూరికి బస్సు మళ్లీ ఎప్పుడు.. బస్సు సౌకర్యం లేక విలవిలలాడుతున్న ప్రజలు విద్యార్థులు మహిళలు రైతులు ఉద్యోగులు వ్యాపారుల - గోడు ఆలకించరా కడప నుంచి వల్లూరు ఆదినిమాయపల్లి పుష్పగిరికి బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ప్రజల వేడుకోలు.. ఉల్లాస్‌లో భాగంగా అక్షరాస్యత పరీక్షలు... *కొత్తూరులో 1968-69 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు ఏఐఎస్ఎఫ్

Select Suryaa Now
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు ఏఐఎస్ఎఫ్

*“విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడొద్దు” — ఏఐఎస్ఎఫ్  ఆగ్రహం*

*తొండూరు గురుకుల ఘటనపై పులివెందుల అంబేద్కర్ సర్కిల్‌లో నిరసన ,అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన AISP కడప జిల్లా అధ్యక్షులు సిదిగె దినేష్ కుమార్*

*ప్రిన్సిపాల్ విధుల నిర్వహణపై కూడా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్*

పులివెందుల మేజర్ న్యూస్:

తొండూరు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ AISP ఆధ్వర్యంలో పులివెందుల అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా AISP కడప జిల్లా అధ్యక్షులు సిదిగె దినేష్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్య వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అయితే తొండూరు గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి ఏర్పడటం ఆ పాఠశాల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. ఒక్కరోజు జరిగిన ఘటనగా దీనిని ముగించకుండా, ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులను అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? పాఠశాల నిర్వహణను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ తనకు అప్పగించిన పరిపాలనా, పర్యవేక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారా లేదా అనే అంశంపై ప్రత్యేకంగా విచారణ జరపాలని కోరారు. ఆహారం, తాగునీరు, మరుగుదొడ్లు, వంటశాల, డైనింగ్ హాల్, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ప్రిన్సిపాల్ మరియు సంబంధిత అధికారులు నిర్వహించిన పర్యవేక్షణకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని అన్నారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన ఆహారం లేదా ఇతర పరిస్థితులను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఆహార, నీటి నమూనాలను పరీక్షించి, పూర్తి నివేదికను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యానికి పాల్పడినట్లు విచారణలో తేలిన ప్రతి ఒక్కరిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకులంలో ప్రత్యేక పారిశుద్ధ్య, ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని కోరారు. “విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు మౌనం వహిస్తే AISP చూస్తూ ఊరుకోదు. విద్యార్థుల భద్రత కోసం ప్రశ్నించడం మా బాధ్యత. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని సిదిగె దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే AISP ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.