చిన్న వెంకన్న మండలంలోని రోడ్లు నిర్మాణానికి 9 కోట్ల రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు ఎమ్మెల్యే మద్దిపాటి
చిన్న వెంకన్న మండలంలోని రోడ్లు నిర్మాణానికి 9 కోట్ల రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు ఎమ్మెల్యే మద్దిపాటి
ద్వారకాతిరుమల మేజర్ న్యూస్ :ద్వారకాతిరుమల మండలం లోని 28 పంచాయతీలలో సిసి రహదారుల నిర్మాణానికి 9కోట్ల 2లక్షల రూపాయలు మంజూరు అయినట్లు గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు . దీనిలో భాగంగా రామసింగవరం పంచాయతీ, గొడుగుపేట గ్రామానికి, లక్ష్మీపురం నుంచి గొడుగుపేట వరకు, 1కోటి 8లక్షల రూపాయలతో సీసీ రహదారి నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన గ్రామపంచాయతీలలో సుమారు 8కోట్ల తో సిసి రహదారులు నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ద్వారకాతిరుమల మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.
నాగ రాజేష్ ద్వారకాతిరుమల