telanagana
ఉల్లాస్‌లో భాగంగా అక్షరాస్యత పరీక్షలు...
సూర్య - పెద్దపల్లి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఉల్లాస్ (ULLAS) కార్యక్రమంలో భాగంగా మహిళా సభ్యులకు అక్షరాస్యతపై పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంపొందించడంతో పాటు ప్రతి మహిళ చదవడం, రాయడం, ప్రాథమిక అంశాలపై అవగాహన కలిగి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.ఇందులో భాగంగా మండలం లోని కొత్తపల్లి గ్రామంలో సీఏల ఆధ్వర్యంలో మహిళా సభ్యులకు ప్రత్యేకంగా అక్షరాస్యత పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో చదవడం, రాయడం, సంఖ్యలను గుర్తించడం, ప్రాథమిక లెక్కలు తదితర అంశాలపై వారి సామర్థ్యాన్ని పరిశీలించారు.మహిళలు ఉత్సాహంగా పరీక్షలకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. అక్షరాస్యత సాధించడం ద్వారా మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు కుటుంబం, సమాజ అభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంటుందని సర్పంచ్ పేర్క రిబ్కా సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఏ లు కలవేన తిరుమల, శానవేన సంధ్య, పేర్క దీప తదితరులు ఉన్నారు.