BREAKING
స్వచ్ఛ రథాలపై ప్రజలకు అవ గాహన కల్పించాలి ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం

రాష్ట్రస్థాయి పోటీలకు గంగాయపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, తంగ్‌తా పోటీల్లో ప్రథమ స్థానాల అభినందనలతో - ప్రిన్సిపాల్ సురేష్ బాబు..

Select Suryaa Now
రాష్ట్రస్థాయి పోటీలకు గంగాయపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు  బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, తంగ్‌తా పోటీల్లో ప్రథమ స్థానాల  అభినందనలతో - ప్రిన్సిపాల్ సురేష్ బాబు..

రాష్ట్రస్థాయి పోటీలకు గంగాయపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు

బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, తంగ్‌తా పోటీల్లో ప్రథమ స్థానాల

అభినందనలతో - ప్రిన్సిపాల్ సురేష్ బాబు..


వల్లూరు మేజర్ న్యూస్

వల్లూరు మండలం గంగాయపల్లిలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు. కడప నగరంలోని స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌-19 బాలుర ఎంపిక పోటీల్లో బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, తంగ్‌తా విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాక్సింగ్‌ 51 కిలోల విభాగంలో సీఈసీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి వై. బాలాజీ ప్రథమ స్థానం సాధించాడు. 57 కిలోల విభాగంలో ఎన్. చరణ్‌కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు. వెయిట్‌లిఫ్టింగ్‌ 65 కిలోల విభాగంలో ఓం కుమార్, తంగ్‌తా విభాగంలో ఓం హరినాథ్ ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయం. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి అన్నారు. మా పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణం అని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి సాధన చేసి ఉత్తమ ప్రతిభ కనబరచాలి. తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల తరఫున అవసరమైన ప్రోత్సాహం, సహకారం ఎల్లప్పుడూ అందిస్తాం అని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్‌బాబు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, శారీరక విద్యా ఉపాధ్యాయురాలు సుశీలమ్మ అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు..