BREAKING
ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు

స్వచ్ఛ రథాలపై ప్రజలకు అవ గాహన కల్పించాలి

Select Suryaa Now
స్వచ్ఛ రథాలపై ప్రజలకు అవ గాహన కల్పించాలి

 

-డీఎల్డీవో కిరణ్ కుమార్

రామభద్రపురం, సెప్టెంబర్ 28(.మేజర్.న్యూస్): స్వచ్ఛ రధాలపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవ గాహన కల్పించాలని బొబ్బిలి డివిజనల్ డవలప్మెంట్ అధికారి ఎం. కిరణ్ కుమార్ సూచించారు. మండల పరిషత్ కార్యాలంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో అపారిశుధ్యం నిర్మూళనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తడి, పొడి చెత్తలను బ్యాగుల ద్వారా ప్రతీ 15 రోజులకు వచ్చే స్వచ్ఛ ర ధాలకు అందజే యాలని తెలిపారు. అలాగే ప్రతీ వీడీవో టన్నుకు తప్పకుండా వర్మి ఉత్పత్తులను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేయాలన్నారు. అలాగే పీజీఆర్ఎస్ గ్రీవెన్స్, ఆర్టీఐ, పత్రికల్లో యాడవర్స్పై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ప్రతీ గ్రామ పం చాయతీలో ప్రతీరోజు క్లోరినేషన్లు చేయాలన్నారు. తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి లైబ్రరీ సెస్లు మొత్తం జిల్లా గ్రంధాలయ సంస్థకే చెల్లించాలన్నారు. 2025–26 సం వత్సరానికి గ్రామ పంచాయతీల్లో ఆడిటింగ్ పూర్తి చేయాలని, అక్టోబర్ నుంచి పన్నులు వసూళు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ఎం.రత్నం, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ పవనకుమార్, డిప్యూటీ ఎంపిడీవోలు వెంకటరమణ, నాగతులసి పాల్గొన్నారు.