BREAKING
పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా టామ్ క్రూయిజ్ డిగ్గర్ సినిమాపై ఆస్కార్ అంచనాలు.. ప్రముఖ దర్శకుడు అలెజాండ్రో ఇన్యారిటు ఆసక్తికర వ్యాఖ్యలు సాయుధ బలగాల అంతరిక్ష సామర్థ్యాల పెంపునకు స్కైరూట్‌కు నేవీ చీఫ్ ఆహ్వానం ఆస్ట్రేలియా సెనేట్ విచారణకు ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సీఈఓలకు పిలుపు యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం మహిళల చేతుల్లో ఉపాధి మిషన్ చెన్నూరులో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు కార్మికుల దోపిడీ కేసులో మిలాన్ యుఎస్ కాన్సులేట్ నిర్మాణ సంస్థకు భారీ షాక్ మితిమీరిన స్క్రీన్ సమయం, తప్పుడు కూర్చునే భంగిమలతో చిన్నారుల వెన్నెముకకు తీవ్ర ముప్పు.. ఫిజియోథెరపీ నిపుణుల హెచ్చరిక బ్రిటన్ ఎయిర్ బేస్ సమీపంలో టెర్రరిజం యాక్ట్ కింద ఐదుగురి అరెస్ట్ బిల్లీ జీన్ కింగ్ కప్‌ విజేతగా చెక్ రిపబ్లిక్

వల్లూరికి బస్సు మళ్లీ ఎప్పుడు.. బస్సు సౌకర్యం లేక విలవిలలాడుతున్న ప్రజలు విద్యార్థులు మహిళలు రైతులు ఉద్యోగులు వ్యాపారుల - గోడు ఆలకించరా కడప నుంచి వల్లూరు ఆదినిమాయపల్లి పుష్పగిరికి బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ప్రజల వేడుకోలు..

Select Suryaa Now
వల్లూరికి బస్సు మళ్లీ ఎప్పుడు..  బస్సు సౌకర్యం లేక విలవిలలాడుతున్న ప్రజలు  విద్యార్థులు మహిళలు రైతులు ఉద్యోగులు వ్యాపారుల - గోడు ఆలకించరా  కడప నుంచి వల్లూరు ఆదినిమాయపల్లి పుష్పగిరికి బస్సు సర్వీసు పునరుద్ధరించాలని   ప్రజల వేడుకోలు..

వల్లూరికి బస్సు మళ్లీ ఎప్పుడు..

బస్సు సౌకర్యం లేక విలవిలలాడుతున్న ప్రజలు

విద్యార్థులు మహిళలు రైతులు ఉద్యోగులు వ్యాపారుల - గోడు ఆలకించరా

కడప నుంచి వల్లూరు ఆదినిమాయపల్లి పుష్పగిరికి బస్సు సర్వీసు పునరుద్ధరించాలని

ప్రజల వేడుకోలు..


వల్లూరు  మేజర్ న్యూస్

వల్లూరు మండల పరిధిలోని ప్రజలకు ప్రయాణ కష్టాలు తీవ్రమవుతున్నాయి. కడప నుంచి వల్లూరు ఆదినిమాయపల్లి మీదుగా పుష్పగిరికి రాకపోకలు సాగించే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసు నిలిచిపోవడంతో విద్యార్థులు మహిళలు రైతులు ఉద్యోగులు చిన్నచిన్న వ్యాపారులు ప్రైవేటు ఆసుపత్రులు షాపింగ్‌ మాల్స్‌ దుకాణాలు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సు సర్వీసు అందుబాటులో ఉండటం వల్ల వల్లూరు మండల పరిధిలోని 9 గ్రామాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో ఈ మార్గంలో బస్సు సౌకర్యం ఉండటంతో గ్రామాల నుంచి వల్లూరు, కడపకు వెళ్లే ప్రజలు విద్యా వైద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అవసరాలను సులభంగా తీర్చుకునేవారని ప్రస్తుతం బస్సు సర్వీసు నిలిచిపోవడంతో అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. బస్సు ఉన్నప్పుడు మా అవసరాలు తీరాయి ఇప్పుడు బస్సు లేక మా పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులకు కూడా ఈ బస్సు సౌకర్యం ఎంతో అవసరమని రైతులు చెబుతున్నారు. పంటలకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడంతో పాటు పండించిన పంటలను మార్కెట్లకు తరలించడం వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లడం బ్యాంకులు సహకార సంఘాలు ఇతర అవసరాల కోసం వల్లూరు, కడప మరియు పరిసర ప్రాంతాలకు వెళ్లడం రైతులకు నిత్య అవసరమని వారు పేర్కొంటున్నారు. గ్రామంలో పొలంలో కష్టపడే రైతు తన వ్యవసాయ అవసరాల కోసం పట్టణానికి వెళ్లాలంటే బస్సు లేక ప్రైవేటు వాహనాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న మహిళలు ప్రైవేటు ఆసుపత్రులు షాపింగ్‌ మాల్స్‌ దుకాణాలు ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నామని ప్రతిరోజూ రాకపోకలకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ మా గ్రామాలకు బస్సు లేకపోతే ఆ సౌకర్యం మాకు ఎలా అందుతుందని మహిళలు ప్రశ్నిస్తున్నారు. పుష్పగిరి నుంచి వల్లూరుకు చేరుకోవాలంటే సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. మార్గమధ్యలో ద్విచక్ర వాహనాలు కనిపిస్తే ఆపి ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వల్లూరు మండలంలోని ఆదినిమాయపల్లి ఆనకట్టకు పర్యాటకులు వస్తుంటారని అలాగే రెండో దక్షిణ కాశీగా పేరుగాంచిన పుష్పగిరి పుణ్యక్షేత్రానికి భక్తులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని ఇలాంటి ప్రాంతాలకు ప్రజా రవాణా సౌకర్యం ఎంతో అవసరమని స్థానికులు పేర్కొంటున్నారు. పుష్పగిరికి వెళ్లే భక్తులు ఆదినిమాయపల్లికి వచ్చే పర్యాటకులు 9 గ్రామాల ప్రజలు విద్యార్థులు మహిళలు రైతులు ఉద్యోగులు వ్యాపారులు అందరూ బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారని స్థానికులు తెలిపారు. గతంలో బస్సు సర్వీసు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించిన అధికారులు ఇప్పుడు అదే సర్వీసును ఎందుకు నిలిపివేశారో తమకు అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా  మా ఊరికి బస్సు ఇవ్వడం అనేది కేవలం ప్రయాణ సౌకర్యం కోసం మాత్రమే కాదు మా పిల్లల చదువుల కోసం, మహిళల ఉపాధి కోసం, రైతుల వ్యవసాయ అవసరాల కోసం, ఉద్యోగుల జీవనాధారం కోసం, చిన్న వ్యాపారుల ఆర్థిక అవసరాల కోసం అత్యవసరమైన అవసరమని ప్రజలు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు వల్లూరు మండల ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కడప నుంచి వల్లూరు ఆదినిమాయపల్లి మీదుగా పుష్పగిరికి బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. 9 గ్రామాల ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఈ బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించి విద్యార్థులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, భక్తులు, పర్యాటకులు సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మా ఊరికి బస్సు ఇవ్వండి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మా పిల్లల చదువులను, మహిళల ఉపాధిని, రైతుల వ్యవసాయ అవసరాలను, సామాన్య ప్రజల జీవనాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సు సర్వీసును మళ్లీ ప్రారంభించండి అంటూ వల్లూరు మండల పరిధిలోని 9 గ్రామాల ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు..


బస్సు సర్వీసుపై డిపో మేనేజర్ వివరణ

కడప - వల్లూరు నుంచి పుష్పగిరి వరకు బస్సు సర్వీసు ఎందుకు రావడం లేదని డిపో మేనేజర్‌ను చరవాణి ద్వారా వివరణ కోరగా, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బస్సు రోడ్డు పక్కకు దిగిపోయి తీవ్రంగా మరమ్మతులకు గురైందని తెలిపారు. దీంతో బస్సును యథావిధిగా సర్వీసుకు పంపడం సాధ్యం కాలేదని, మరమ్మత్తులు పూర్తయ్యాయి కడప - వల్లూరు, ఆదివాయపల్లి, పుష్పగిరి మార్గంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసును యథావిధిగా పునరుద్ధరిస్తామని డిపో మేనేజర్ తెలిపారు..