BREAKING
యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం మహిళల చేతుల్లో ఉపాధి మిషన్ చెన్నూరులో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు కార్మికుల దోపిడీ కేసులో మిలాన్ యుఎస్ కాన్సులేట్ నిర్మాణ సంస్థకు భారీ షాక్ మితిమీరిన స్క్రీన్ సమయం, తప్పుడు కూర్చునే భంగిమలతో చిన్నారుల వెన్నెముకకు తీవ్ర ముప్పు.. ఫిజియోథెరపీ నిపుణుల హెచ్చరిక బ్రిటన్ ఎయిర్ బేస్ సమీపంలో టెర్రరిజం యాక్ట్ కింద ఐదుగురి అరెస్ట్ బిల్లీ జీన్ కింగ్ కప్‌ విజేతగా చెక్ రిపబ్లిక్ త్రిపుర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే చోదక శక్తిగా మారుతోంది.. ముఖ్యమంత్రి మాణిక్ సాహా వెల్లడి కొరియా సరిహద్దు డిఎమ్‌జడ్‌లో భారీ పేలుడు టర్కీ రాజకీయంలో సంచలనం పల్లె పండుగకు రామాపురం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి

+విజయవాడకు తరలివస్తున్న సచివాలయ ఉద్యోగులు +జిల్లాల్లోనే అడ్డుకుంటున్న పోలీసులు.. +బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అదుపులోకి..

Select Suryaa Now
+విజయవాడకు తరలివస్తున్న సచివాలయ ఉద్యోగులు  +జిల్లాల్లోనే అడ్డుకుంటున్న పోలీసులు..  +బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అదుపులోకి..

విజయవాడ సూర్య ప్రతినిధి : సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో నిరసన చేపట్టేందుకు తరలివస్తున్న సచివాలయ ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల నుంచి విజయవాడకు చేరుకుంటున్న ఉద్యోగులను బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు.

నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్నామని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఉద్యోగులను ముందస్తుగా అడ్డుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.