కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె
వీఆర్ఏలు 12వ రోజు నిరవధిక సమ్మె
రావులపాలెం మేజర్ న్యూస్
రాష్ట్ర వ్యాప్త వీఆర్ఏల నిరవధిక సమ్మెలో భాగంగా 12వ రోజు రావులపాలెం తాసిల్దార్ కార్యాలయం వద్ద దీక్షను కొనసాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సమస్యలు ను ప్రభుత్వం గుర్తించి తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వో గా ప్రమోషన్ ఇవ్వాలని నామిని వీఆర్ఏ లను వీఆర్ఏలుగా ప్రమోట్ చేయాలని తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏలు సంఘం అధ్యక్షులు దామోదర్ సత్యనారాయణ, బండారు జ్యోతి వి ఆర్ ఏ లు సూరయ్య మల్లేశ్వరపు వరప్రసాదు అత్తిలి వెంకన్న కొండపర్తి శేషవేణి యార్లగడ్డ వెంకటరావు కొడమంచిలి కాంతారావు దామోదర్ చిన్న సత్యనారాయణ నీలకంఠ సత్యనారాయణ పితాని రాముడు మత్తాల విజయ్ కుమారి సూర్యకాంతం అయినవిల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు