భక్తులతో పోటెత్తిన వాడపల్లి వెంకన్న ఆలయం
ఆధ్యాత్మికతతో సోబిల్లిన వాడపల్లి క్షేత్రం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల గా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం ఆధ్యాత్మికతతో సోబిల్లింది ఏడు శనివారాల నోము నోచుకుని అష్టోత్రం కళ్యాణం చేయించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామ స్మరణతో ప్రతిధ్వనించింది వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదాన నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలపకుండా చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు