BREAKING
తలకింద ఫోన్ పెట్టుకుని పడుకుంటున్నారా? అయితే ఈ తీవ్రమైన ఆరోగ్య ముప్పు తప్పదు! యుఎల్‌సి దరఖాస్తులకు మోక్షం కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అర్హత ఉన్న కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశాలు 22ఏ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతున్న ప్రభుత్వం శాసనసభలో సీఎం ఇచ్చిన హామీలకు కార్యరూపం ఇప్పటికే మూడు కీలక నిర్ణయాలు తాజాగా యుఎల్‌సిపై స్పష్టమైన ఉత్తర్వుల కొండగట్టు అంజన్నను దర్శించుకుని హనుమాన్ దీక్ష స్వీకరించిన హీరో వరుణ్ తేజ్ ది ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పాత్రపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు: థియేటర్లలో దద్దరిల్లిన రెస్పాన్స్ టీజీ సేఫ్‌ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం వైఎస్ఆర్సిపి నాయకులు రూ.97 వేలతో లడ్డూ సొంతం చేసుకున్న బొబ్బల దంపతులు ఏఐతో పర్యాటక రంగానికి మరింత ఊతం* మిరపకాయ్ హీరోయిన్ దీక్షా సేథ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: ఎంతగా మారిపోయిందో చూడండి రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ భారత్‌ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు: ఒకప్పుడు రిజెక్ట్ చేసిన బ్రాండ్‌కే అంబాసిడర్‌గా ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు

భావితరాలకు మనం ఇచ్చే సంపద చెట్లే.. -నరుకూరులో మొక్కలు నాటిన టీడీపీ యువనేతలు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి..

Select Suryaa Now
భావితరాలకు మనం ఇచ్చే సంపద చెట్లే..  -నరుకూరులో మొక్కలు నాటిన టీడీపీ యువనేతలు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి..

భావితరాలకు మనం ఇచ్చే సంపద చెట్లే..

-నరుకూరులో మొక్కలు నాటిన టీడీపీ యువనేతలు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి..

-పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..

-సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..

పొదలకూరు, మేజర్ న్యూస్:

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి అన్నారు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో బీవీఎస్ స్టార్ సిటీ అధినేత శేషయ్య ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భావితరాలకు మనం అందించే విలువైన సంపద మొక్కలు, చెట్లేనని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. నరుకూరులో 200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన బీవీఎస్ స్టార్ సిటీ శేషయ్యను అభినందించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని ప్రజోపయోగ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లో ఉత్సాహంగా పనిచేయడం శుభపరిణామమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు లబ్ధి చేకూర్చడంలో యువత కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రజలకు సోమిరెడ్డి కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ప్రజోపయోగ కార్యక్రమాలకు అధికారులు సహకరించాలి..

ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే సమయంలో అధికారులు అడ్డంకులు సృష్టించడం సరికాదని సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే దానికి పరిష్కార మార్గాలను అన్వేషించాలే తప్ప, కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయడం సరికాదన్నారు. పంచాయతీ పరిధిలో 100 వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన శేషయ్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, బీవీఎస్ స్టార్ సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.