రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం వైఎస్ఆర్సిపి నాయకులు
రామగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం
సచివాలయ నియామకాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం: వైఎస్సార్‌సీపీ నేతలు
పులివెందుల మేజర్ న్యూస్ :
సచివాలయ ఉద్యోగ నియామకాలపై రామగోపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
సచివాలయ నియామకాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారని గుర్తుచేశారు. అదే విధంగా మెగా డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో ఉండి కూడా ఆధారాలతో ఆరోపణలను నిరూపించకుండా సచివాలయ నియామకాలపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రామగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు సరైన అలవెన్సులు, పదోన్నతులు లేక పరిస్థితులు దయనీయంగా మారాయని పేర్కొన్నారు. సచివాలయ నియామకాలపై ఆరోపణలు చేస్తున్న రాంగోపాల్ రెడ్డి ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేనిపక్షంలో సచివాలయ ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పులివెందులలో ఎన్నికలు సమీపించినప్పుడల్లా కూటమి నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు గడుస్తున్నా పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అలాంటి చంద్రబాబును రాంగోపాల్ రెడ్డి నిలదీయాలని రిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు వరప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. హఫీజ్ పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్ రెడ్డి ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప రాష్ట్ర నూర్ భాషా సంఘం మాజీ అధ్యక్షుడు రసూల్ మాజీ కౌన్సిలర్ కోడి రమణ కనక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు