BREAKING
స్వచ్ఛ రథాలపై ప్రజలకు అవ గాహన కల్పించాలి ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ..... రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు --కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Select Suryaa Now
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం  ..... రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు --కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం 
..... రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 
....... నియోజకవర్గంలో 850 కోట్ల తో అభివృద్ధి
...... 1.78 కోట్లతో రెండు బ్రిడ్జిలకు శంకుస్థాపన 
..... బ్రిడ్జిల నిర్మాణంతో రైతుల కష్టాలకు పరిష్కారం
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ 
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమె బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగు, కాళయకాగొల్లు గ్రామాలలో కోవూరు కాలవపై1.78 కోట్లతో  నిర్మించునున్న బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దామరమడుగు లో కోవూరు కాలువ పైనున్న బ్రిడ్జి 2000 సంవత్సరంలో పడిపోయిందని అప్పటినుండి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇంతవరకు నాలుగైదు సార్లు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం మన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బ్రిడ్జి నిర్మాణానికి ఎఫ్డిఆర్ ఫండ్స్ నుండి 90 లక్షల రూపాయలు మంజూరు చేసి త్వరగా పనులు కూడా ప్రారంభించే విధంగా ఈ బ్రిడ్జిని ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పాటూరు, దామరమడుగు, గుమ్మల దిబ్బ, కోవూరు  ఎల్లాయపాలెం గ్రామాల ప్రజలందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, రైతులు తాము పండించిన పంటను బయటకు తీసుకెళ్లి అమ్ముకునేందుకు కూడా రవాణాసౌకర్యం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి దిశగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఇంతవరకు 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. నియోజకవర్గానికి ఇంత  చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్నారు. ఈనెల 29న ఉదయగిరిలోని వరికుంటపాడు లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ బాబు పాల్గొంటారని తెలిపారు. జీ రాంజీలో  నియోజకవర్గానికి మరో 10 కోట్లు మంజూరయ్యాయని తెలియజేయుటకు సంతోషిస్తున్నానన్నారు. దానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభించనున్న ట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రూరల్ అధ్యక్షులు బెజవాడ జగదీష్, టిడిపి నాయకులు కె.వి శేషయ్య, ఏటూరి శివరామ కృష్ణారెడ్డి, బత్తల హరికృష్ణ, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు