BREAKING
ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్! దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి.. కూచిపూడి గ్రేడ్ పరీక్షలను నిర్వహించిన అఖిల భారత కళా సాధన పరిషత్ సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: రవికుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా అమెరి కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

విద్యార్థినుల చదువుకు సైకిళ్ల భరోసా

Select Suryaa Now
విద్యార్థినుల చదువుకు సైకిళ్ల భరోసా

భోగాపురం, సూర్య : విద్యార్థినుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందిస్తూ, వారి ప్రయాణ కష్టాలను తగ్గించాలనే లక్ష్యంతో నాతవలస టోల్ ప్లాజా ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ హైవే ఇన్‌ఫ్రా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు సుమారు రూ.70 వేలతో భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భోగాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అదబాల. రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థినులకు సైకిళ్లు అందించడం సంతోషకరమన్నారు. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థినులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ, ఎడమవైపు నుంచి ప్రయాణం సాగించాలని సూచించారు. టోల్ ప్లాజా మేనేజర్ జె. రవిబాబు మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో భోగాపురం పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు అందించడం ఆనందంగా ఉందన్నారు. భోగాపురం మండలంలోని సుందరపేట సామాజిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్‌కు వాటర్ ప్యూరిఫైయర్ పరికరాలను కూడా అందజేసినట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా అధ్యక్షులు చింతపల్లి శ్రీనివాసరావు, టిబిఆర్ మేనేజర్ కేశవమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.