BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

వెంకన్న సన్నిధిలో జగద్గురు శంకరాచార్య స్వామీజీ

Select Suryaa Now
వెంకన్న సన్నిధిలో  జగద్గురు శంకరాచార్య స్వామీజీ

 కోనసీమ వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పూరి గోవర్ధన్ పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ ఆద్యోక్షజానంద స్వామీజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన పూజ్య శంకరాచార్యులకు ఆలయ అధికారులు, అర్చక బృందం పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ గర్భాలయంలో కొలువుదీరిన వేంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనానంతరం అర్చక స్వాములు శంకరాచార్యులకు వేదాశీర్వచనం అందజేసి, స్వామివారి శేషవస్త్రాలు, దివ్య చిత్రపటం మరియు తీర్థప్రసాదాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ.. సనాతన ధర్మ రక్షణ, వేద సంస్కృతి పరిరక్షణ, గోసంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణల ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలో నైతిక, ధార్మిక విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. భారతీయ ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలను, వేద జ్ఞానాన్ని భావితరాలకు సజీవంగా అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.