BREAKING
120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తహసీల్దార్ కు వినతి గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం. స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..? ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం

వెలుగు సంస్థలో ఘనంగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
వెలుగు సంస్థలో ఘనంగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి జన్మదిన వేడుకలు

వెలుగు సంస్థలో ఘనంగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి జన్మదిన వేడుకలు

దివ్యాంగులు, వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు.. అన్నదానం

వెలుగు సంస్థ వ్యవస్థాపకురాలు స్వర్గీయ పద్మజ, వెలుగు సంస్థ సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి కుమారుడు ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి జన్మదిన వేడుకలు వెలుగు సంస్థ ప్రాంగణంలో దివ్యాంగులు, వృద్ధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి వెలుగు సంస్థకు విచ్చేసి దివ్యాంగులు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెలుగు సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ ఆర్. భాగ్యలక్ష్మి, పెద్దమ్మ ఎం. సుజాత ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ ఉదయ్ కార్తికేయ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం దివ్యాంగులు, వృద్ధులకు స్నాక్స్ అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన వేడుకలను జరుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి, వెలుగు సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ ఆర్. భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ లీనా కుమారి, వార్డెన్ స్వీటీ, వెలుగు సంస్థ చిన్నారులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.