వెల్లటూరు - దోనేపూడి రహదారి క్లియర్ చేసిన పోలీసులు
భట్టిప్రోలు, మేజర్‌న్యూస్ :
అర్నబ్ తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది.
ఈ క్రమంలో బలమైన గాలులకు భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లటూరు - దోనేపూడి రహదారిపై ఓ భారీ వృక్షం విరిగిపడింది. సమాచారం అందుకున్న వెంటనే భట్టిప్రోలు పోలీసులు తక్షణమే స్పందించి నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్, ట్రాక్టర్, వుడ్ కట్టర్ల సహాయంతో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వేగంగా స్పందించి వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసుల పనితీరు పట్ల స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.