వీఎస్‌యూ కళాశాల జట్టుకు నెల్లూరు జోన్ క్రికెట్ టైటిల్
వెంకటాచలం, మేజర్ న్యూస్ : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ నెల్లూరు జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో వీఎస్‌యూ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో జెనెక్స్ కళాశాల జట్టుపై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేత జట్టుకు వీఎస్‌యూ వైస్‌ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు ట్రోఫీ అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య టి. వీరారెడ్డి, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య సీహెచ్. వెంకట్రాయలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.