BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

వీఆర్ఏలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Select Suryaa Now
వీఆర్ఏలకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఆత్రేయపురం మేజర్ న్యూస్ :తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన నిరసన కార్యక్రమం శుక్రవారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా నిరసన కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో, విధులు లేక ఇబ్బందులు పడుతున్న వీఆర్ఏలకు అండగా నిలిచేందుకు తహసీల్దార్ ఆర్.డి. రామచంద్రమూర్తి ముందుకొచ్చారు. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పంచదార ఇప్పించడంతో పాటు, తన సొంత ఖర్చులతో వారికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసి గొప్ప మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తహసీల్దార్ చూపిన చొరవ పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు.

అనంతరం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రతినిధులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏలు సమ్మెలో ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనులకు తీవ్ర ఆటంకం, జాప్యం కలుగుతోందని, కాబట్టి తమ సమస్యలను పరిష్కరించేలా జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక నివేదిక (లెటర్) పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ.. వీఆర్ఏల సమస్యలను, పరిపాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ కలెక్టర్‌కు తక్షణమే లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.