వేడుకగా గ్రంథాలయ వారోత్సవాలు.
ముదిగుబ్బలో ప్రతి ఏటా బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించి గ్రంథాలయ వారోత్సవాలను శనివారం నాడు స్థానిక గ్రంథాలయంలో వేడుకగా నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారి ప్రతాప్ తెలిపారు. గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా 14 నుండి 20వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు, 15న పుస్తక ప్రదర్శన, 16న ప్రముఖుల గురించి ప్రసంగాలు, 17న సెమినార్లు, 18న విద్యార్థులకు వివిధ అంశాలపై ఆటల పోటీలు, 19న మహిళా దినోత్సవం, 20న ముగింపు సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రధానం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.