BREAKING
తేజ డాక్టరేట్ ప్రదానం విమాన ఇంధనంలో విప్లవం: ఎస్ఏఎఫ్ కోసం కేంద్రం మెగా ప్లాన్ 14 నుంచి బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం - శాప్ చైర్మన్ రవి నాయుడుకు ఆహ్వానం ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి... - ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి - గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి - ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ కె. గంగవరం పంచాయతీ పీఠం నాగేశ్వరరావుకే..! ఢిల్లీ యమునా రివర్ క్రూయిజ్: బుకింగ్ & రూట్ వివరాలు నగర అభివృద్ధికి అండగా ఉంటాం విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టిన 3D ప్రాజెక్టుల ప్రదర్శన క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం 70వ ఎస్‌జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం బడ్జెట్ 2027: పీహెచ్‌డీసీసీఐ 5 ప్రధాన డిమాండ్లు వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు జీవో నెం.15ను అమలు చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి - అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు దేశపాలెంలో వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన పలువురు కార్యకర్తలు శ్రీరామ్ చిన్నబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు రఫా సరిహద్దులో లూయిస్ హామిల్టన్: గాజా సహాయక పరిశీలన టెక్స్ టైల్ పార్క్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరపాలి

వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి.. గుర్తులు సిద్ధం సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు.. వార్డు సభ్యులకు 20 గుర్తులు

Select Suryaa Now
వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి.. గుర్తులు సిద్ధం  సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు.. వార్డు సభ్యులకు 20 గుర్తులు

వత్సవాయి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల కోసం ఎన్నికల గుర్తులను సిద్ధం చేసింది. సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులను కేటాయించింది. వీటితోపాటు నోటా గుర్తును కూడా అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగిన పక్షంలో అదనపు గుర్తులను కేటాయించే అవకాశం ఉంది.

వత్సవాయి మండలంలోనూ గ్రామపంచాయతీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల గుర్తుల కేటాయింపుతో గ్రామాల్లో ఎన్నికల సందడి మరింత పెరగనుంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు ఎన్నికల గుర్తులపై దృష్టి సారిస్తున్నారు.

సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు: మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు-సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా.

వార్డు సభ్యుల గుర్తులు: ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీ పెట్టె, పోస్టు డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్‌క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు.

ఎన్నికల గుర్తుల కేటాయింపు అనంతరం అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.