BREAKING
నేటి బాలలే రేపటి పౌరులు నవంబర్ 12న థియేటర్లలోకి రాహుల్ విజయ్ ‘అ’ మూవీ: ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్! శక్తి పొదుపుపై విద్యార్థులకు అవగాహన.. *ఎస్.సి కాలనీ నుండి బంధము వరకు నూతన మురుగునీటి కాలువ నిర్మాణ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందేల సుజాత బాలకిషన్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అమిత్‌ షా సభకు బీజేపీ శ్రేణుల తరలింపు *వాహన తనిఖీలు నిర్వహించిన అదనపు ఎస్సై దేవ్ సింగ్ ప్రతి విద్యార్థిలో భాషా, గణిత నైపుణ్యాలు పెంపొందించాలి - కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎన్నికలు నిర్వహణలో ఎస్ఈసీ విఫలం....భీశెట్టి సైదాబాద్‌లో చైన్ స్నాచర్ అరెస్ట్ 17.160 గ్రాముల బంగారు గొలుసు, బైక్ స్వాధీనం మురసు తూఫాన్ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి: గొట్టిపాటి లక్ష్మీ. రాంపల్లిలో రూ.40 లక్షలతో డ్రైనేజీ పనులకు శ్రీకారం ఘనంగా ‘చాణక్య’ టీజర్ లాంచ్: ఎస్‌ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ! టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి సీనియర్ నాయకుల చేరిక.. కౌంట్ డౌన్.... * ఉదయం 8 నుంచి ప్రారంభం * మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు.

వర్షాభావంపై క్షేత్రస్థాయి పరిశీలన తుగ్గలి మండలంలో కేంద్ర కరువు బృందం పర్యటన రైతులతో ముఖాముఖి.. పంట నష్టాల అంచనా

Select Suryaa Now
వర్షాభావంపై క్షేత్రస్థాయి పరిశీలన తుగ్గలి మండలంలో కేంద్ర కరువు బృందం పర్యటన రైతులతో ముఖాముఖి.. పంట నష్టాల అంచనా

తుగ్గలి మేజర్ న్యూస్: ఖరీఫ్‌–2026 సీజన్‌లో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర కరువు అంచనా బృందం (IMCT) సోమవారం జిల్లాలో పర్యటించింది. తుగ్గలి మండలంలోని చెరువు తాండ, యర్రగుడి గ్రామాల్లో పర్యటించి నీటి వనరులు, ఎండిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకుంది.

కేంద్ర ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ కె. పొన్నుసామి నేతృత్వంలో విచ్చేసిన ఈ బృందంలో రాష్ట్ర నోడల్ అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి (ఐఏఎస్), నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధ బటానా, ధీరేంద్ర కుమార్ (RIC), కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, పశుసంవర్ధక శాఖ లైవ్‌స్టాక్ ఆఫీసర్ డాక్టర్ సాక్షి భదౌరియా పాల్గొన్నారు.

పంట పొలాల సందర్శన..

ముందుగా చెరువు తాండా గ్రామంలోని చెరువును సందర్శించిన బృందం నీటి నిల్వలు, సాగునీటి వివరాలపై అధికారులతో చర్చించింది. అనంతరం యర్రగుడి గ్రామంలో రైతు హనుమంతు పొలాన్ని సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించింది. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వీక్షించిన అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి వర్షాభావ ప్రభావం, దిగుబడుల క్షీణతపై వివరాలు సేకరించింది.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఆర్డీవో ఓబులేసు, ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ రాజశేఖర్, జలవనరుల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్, డ్వామా పీడీ నరసింహారెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.