BREAKING
భూ సమస్య ఫిర్యాదు పై ఏసీపి విచారణ...... రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి బీజేపీ మహా పాదయాత్రకు ఘన స్వాగతం ప్రజా సమస్యలపై అధికారులకు పట్టింపేది....... కాశీబుగ్గ సబ్-డివిజన్ లో నెల రోజులు పోలీస్ యాక్ట్ 30 అమలు. 'ఖేత్ బచావో అభియాన్' మహానేత ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం అంసానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

శక్తి పొదుపుపై విద్యార్థులకు అవగాహన..

Select Suryaa Now
శక్తి పొదుపుపై విద్యార్థులకు అవగాహన..


ములకలచెరువు, మేజర్ న్యూస్, అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం బ్రిక్స్ స్టైనబుల్ లైఫ్ స్టైల్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ మరియు కమిషనర్ ఆదేశాల మేరకు నవంబర్ 1తేది నుండి7 వ తేదీ వరకు శక్తి పొదుపు పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యుత్ వినియోగం పొదుపుపై అవగాహన మరియు విద్యుత్ వృధాను తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు సహజ వనరులను కాపాడువచ్చు అని తెలిపారు. ప్రతి విద్యార్థి తన ఇంట్లో మరియు తమ కళాశాలలో విద్యుత్ వినియోగంపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఛాలెంజ్ గా ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేశారు. శక్తి పొదుపు విషయంలో ప్రజలలో మరియు యువతలో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని శక్తి సంరక్షణ పై తమ బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి శివరామయ్య, కళాశాల అధ్యాపకులు అల్తాఫ్ భాను, అమరావతి, రేష్మ, నోములమ్మ, కళావతి, జయచంద్రారెడ్డి, కృష్ణప్ప, నాగ మోహన్, శివశంకర్, రాజ వర్ధన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె