మురసు తూఫాన్ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి: గొట్టిపాటి లక్ష్మీ.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు..పునరావాస కేంద్రాలను ఏర్పాటు
వర్షపు నీరు నిలవకుండా చర్యలు.. డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి.
విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై ప్రత్యేక నిఘా.
అత్యవసర బృందాలు సిద్ధంగా ఉండాలి.. కంట్రోల్ రూం ఏర్పాటు.
సూర్య న్యూస్ దర్శి.
మురసు తూఫాన్ ప్రభావంతో దర్శి నియోజకవర్గంలో భారీ వర్షాలు తీవ్రంగా ఉండనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. పునరావాస కేంద్రాలు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటి పరిస్థితి తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఫోన్ లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడారు.
మురసు తూఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉండాలని సూచించారు . ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేశామని అన్నారు.
విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించి సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు.
వర్షాలు తగ్గే వరకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సూచించారు.