రాంపల్లిలో రూ.40 లక్షలతో డ్రైనేజీ పనులకు శ్రీకారం
కీసర, మేజర్ న్యూస్:నాగారం డివిజన్ పరిధిలోని రాంపల్లి మహాలక్ష్మి నగర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభమయ్యాయి. కాలనీవాసుల సౌకర్యార్థం రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులను సోమవారం మొదలుపెట్టారు.కాలనీలో చాలాకాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడంతో పాటు, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడితే మురుగునీటి సమస్యలు తగ్గి, కాలనీవాసులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడనుంది.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు కౌకుట్ల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహాలక్ష్మి నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.