వైసీపీకి విజయ కిరీటం
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో 31వ డివిజన్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమిళ అరసి విజయం సాధించారు. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు సాగిన ఉత్కంఠకు ఓట్ల లెక్కింపుతో తెరపడింది. ఓటర్లు తమ తీర్పును స్పష్టంగా వెల్లడించడంతో తమిళ అరసి విజయాన్ని అందుకున్నారు.31వ డివిజన్ లో జరిగిన ఈ ఎన్నిక స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రచార సమయంలో అభ్యర్థులు తమ తమ వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ అనంతరం వెలువడిన ఫలితాల్లో తమిళ అరసి విజయం సాధించడం. వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపింది. విజయం.అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలియజేసారు. ఈ గెలుపు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షలు సానికంగా వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్చే అంతిమమని, 31వ డివిజన్ ప్రజలు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్