వైసీపీ నామినేషన్లు అడ్డుకోలేదు -66 డివిజన్లకు 73 వైసీపీ నామినేషన్లు -కూటమి ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనం : పనభాకలక్ష్మి -అరాచకాల సంస్కృతి వైసిపిది -అధికారం పోయినా అహంకారం పోలేదు -అధికారంలో ఉన్నామన్న భ్రమలో బతుకుతున్న వైసీపీ నేతలు -పవిత్ర తిరుపతిని స్వార్థ రాజకీయాలతో కలుషితం చేస్తున్న వైసీపీ : దివ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో వైయస్సార్సీపి అభ్యర్థుల నామినేషన్లు ఎక్కడ కూటమికి చెందిన నాయకులు అడ్డుకోలేదని కూటమి నేతలు స్పష్టం చేశారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తిరుపతి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ వారిని అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలును ఖండిస్తూ ఆదివారం నగర మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపి పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తుడా చైర్మన్, టిటిడి టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులు, టిడిపి తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా.డాలర్స్ దివాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్ నూకసాని బాలాజీతో కలసి వైసిపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కూటమి ప్రజాస్వామ్యానికి నిదర్శనం
ఈ సందర్భంగా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాకలక్ష్మి మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థులు 66 డివిజన్లకు 73 మంది నామినేషన్లు దాఖలు చేశారని, కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంది అనేందుకు ఇంతకంటే నిదర్శనం కావాలని ప్రశ్నించారు. కావాలని వైసిపి నేతలు తమను అడ్డుకున్నారని నామినేషన్లు దాఖలు చేయలేకపోయినామని చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉందన్నారు. కంటి ముందు 73 మంది నామినేషన్లు వేసినప్పటికీ తమ పార్టీకి చెందిన వారు నామినేషన్లు వేయలేదని చెప్పడం విడ్డూరమన్నారు. పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ జరిగితే లేనిపోని అపోహలు కల్పించుకుని తమపై దాడి చేశారని, తమ నామినేషన్లు పత్రాలు చించేసారని, అభ్యర్థులు చెప్పడం సబబు కాదన్నారు.
రెండు రోజుల్లో 200 నామినేషన్లు దాఖలు
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా గత రెండు రోజులుగా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు 200కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పక్షపాతం లేకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పోటీ చేసేలా ఎన్నికల ప్రక్రియ సాగుతోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చూసిన భయానక పరిస్థితులు నేడు ఎక్కడా లేవని పేర్కొన్నారు.
పుణ్యక్షేత్రంలో అరాచకాల సంస్కృతి వైసిపిది
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతూ కల్ల బుల్లి మాటలు చెబుతూ ప్రజల మద్దతు లేకపోయినా కూడా తాము హీరోలు మంటూ గొప్పలు చెప్పుకుంటూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన నగరంలో అరాచకాల సృష్టించి ఆ సంస్కృతిని తెరలేపింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ నాయకులు ఇంకా తాము అధికారంలోనే ఉన్నట్లు భ్రమల్లో బతుకుతూ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారం పోయినా అహంకారం పోలేదని, ప్రజలు తిరస్కరించినా ఇంకా పాత రౌడీ సంస్కృతినే కొనసాగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో నామినేషన్లు కూడా వెయ్యనీయకుండా అరాచకాలు సృష్టించి ఓటమి అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనను గుర్తు చేశారు. ఇంత చేసినప్పటికీ తాము టిడిపి అధిష్టానం ఆదేశాలు మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాం తప్ప మరొకటి లేదని తేల్చి చెప్పారు. కావాలని తమపై అభ్యర్థులపై లేని పోనీ అపోహలు సృష్టించి ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మారారు అధికారం మారింది కానీ వైసీపీ నాయకుల తీరు మాత్రం మారలేదని మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన అధికారం కోసం పరితపించడం వైసిపి చీప్ పాలిటిక్స్ కు నిదర్శనమని పేర్కొన్నారు.
పవిత్ర నగరాన్ని అపత్రం చేస్తున్న వైసిపి
శ్రీవారి పాదాల చెంత ఉంటూ...ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని వైసీపీ నేతలు అపవిత్రం చేస్తూ చెప్పేటివన్నీ శ్రీరంగనీతులు చేసేటివన్నీ దొమ్మరగొడుచులు అన్న చందనంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశాలు కనిపించాలని ఉద్దేశంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత మంత్రి నారా లోకేష్ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు చావు లేకుండా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఉద్దేశం పూర్వకంగా రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం బాధాకరంమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం కూటమి నిష్పక్షపాతంగా, తిరుగులేని మెజారిటీతో విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి
ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, సజావుగా సాగేలా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నిరంతరం దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. కూటమి శ్రేణులు అత్యంత సంయమనం, ఓర్పుతో వ్యవహరిస్తుంటే, వారిని రెచ్చగొట్టేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ప్రశాంతంగా ఉండే పవిత్ర తిరుపతి పుణ్యక్షేత్రాన్ని వైసీపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం కలుషితం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కూటమి నేతలు ఎక్కడా నామినేషన్లను అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన అరాచకాలు ఇంతవరకు ఎక్కడా చూడలేదని అన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం రెచ్చిపోయారని మండిపడ్డారు. టీడీపీ నేతలను వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్