ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు... *ఎంపీడీవో బి వి జ పాత్రో
పాచిపెంట, సూర్య : పార్వతిపురం మన్యం జిల్లాలో స్థానిక సంస్థలు (మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్ పి టి సి, గ్రామ పంచాయితీ సర్పంచులు) ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చినందున మండల పరిషత్తు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను (పి జి ఆర్ ఎస్) మరియు డైలీ గ్రీవెన్స్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు స్థానిక ఎంపీడీవో బి వి జ పాత్రో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలక్షన్ కోడ్ అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ గడువు ముగిసే వరకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్
కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మండల అధికారులు, ప్రజలు గమనించాలని ఎంపీడీవో కోరారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎవరు కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించరాదని తెలిపారు.
రిపోర్టర్ : ప్రసాద్ రాజు, పార్వతీపురం మన్యం.