BREAKING
అది పొరపాటే.. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్ కలసపాడులో ఘనంగా వాసవీమాత నవరాత్రి ఉత్సవాలు అద్దంకిలో జోరందుకున్న టీడీపీ ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పార్టీలు సహకరించాలి. దుర్గామాత రూపంలో ఏడుపాయల వన దుర్గమ్మ దసరా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ ఆర్ బాబు నాయక్ ఎస్పీ రాం కుమార్ దంపతులకు ఘన సన్మానం నంది గుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు.. * జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నల్లంపల్లి లో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న సర్పంచ్ రాధిక ఏసయ్య కోడి పందాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్ ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ఎలికట్టలో అంభ భవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు కుశాలపురంలో ఘనంగా కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన కడప 27వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా వెంకట శివ నామినేషన్ దాఖలు

వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Select Suryaa Now
వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ;తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజ తోరణం, ధ్వజ కుంభారాధన, అగ్ని ప్రతిష్ట, యాగశాల ప్రవేశం తదితర విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

​ఉత్సవాలకు సంపూర్ణ సహకారం

ఈ నెల 17 నుండి 27వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల పూజా క్రతువులకు, యజ్ఞయాగాలకు అవసరమైన సమస్త పూజా సామగ్రితో పాటు వేద పండితులకు, ఆలయ సిబ్బందికి భోజన వసతి ఏర్పాట్లను జిందం కళా చక్రపాణి దంపతులు తమ సొంత ఖర్చులతో సమకూర్చారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

​ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు అడిచర్ల రూప సాయి కృష్ణ దంపతులు, భారత రాష్ట్ర సమితి నాయకులు సామల శ్రీనివాస్, కోడం శ్రీనివాస్, దూడం శ్రీనివాస్, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.