స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్
పలాస, సూర్య : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.అక్రమ కార్యకలాపాల నియంత్రణ,ప్రజలకు భద్రత కల్పించే లక్ష్యంతో విస్తృతంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపడుతోంది.
ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు : జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి,ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం సరుబుజ్జిలి మండలం బొప్పడం గ్రామంలో,పలాస మండలం కాశీబుగ్గ పట్టణంలో సంబంధిత పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.అనుమానాస్పద వ్యక్తులు,వస్తువులు,అక్రమ కార్యకలాపాలపై తనిఖీలు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ప్రజలు సహకరించాలి : ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు, గుర్తుతెలియని వాహనాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.గంజాయి,అక్రమ మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా లేదా విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
రిపోర్టర్ : విశ్వేశ్వర, పలాస, శ్రీకాకుళం జిల్లా.