BREAKING
లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి: ఒకే ఈతలో రెండు దూడల జననం. మేయర్ పదవికి ఇండిపెండెంట్ గా సోషల్ వర్కర్ దీనా గ్లాడి పోటీ తిరుపతమ్మ నామినేషన్‌లో దారపనేని తిరుపతమ్మకు పామూరు టీడీపీ నేతలు అభినందనలు కాంగ్రెస్‌కు బివిఎం శివశంకర్ రాజీనామా ముగిసిన వాలీబాల్ పోటీలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో 300 నామినేషన్లు స్వీకరణమూడు రోజుల్లో 300 నామినేషన్లు.. 282 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం! *పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు** గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ --ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా! --వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎస్పీ రాం కుమార్ దంపతులకు ఘన సన్మానం

Select Suryaa Now
ఎస్పీ రాం కుమార్ దంపతులకు ఘన సన్మానం

కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి -ఎస్పీ రాం కుమార్


నరసింహులగూడెంలో ఉద్యోగ సాధకులకు సత్కారం


 

యువత లక్ష్యంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

మునగాల, మేజర్ న్యూస్: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కామల్ల రాం కుమార్, ప్రశాంతి దంపతులను గ్రామ సర్పంచ్ కుంచెం ఇందిరా నరసయ్య ఆధ్వర్యంలో వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు.

గత ఆగస్టు 15న రాష్ట్రపతి సేవా పతకం అవార్డు అందుకోవడంతో పాటు ఎస్పీగా పదోన్నతి పొందిన రాం కుమార్ ను గ్రామస్థులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాం కుమార్ మాట్లాడుతూ..1991లో తొలిసారిగా ఎస్సైగా ఉద్యోగం సాధించానని తెలిపారు. గ్రామానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి, ఆదిరెడ్డిలను స్ఫూర్తిగా తీసుకుని, వారి ఆదర్శాలతో ముందుకు సాగుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల యువత పట్టుదలతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని యువతకు సూచించారు.

అనంతరం గ్రామంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతను కూడా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులు, యువతకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించిన వివేకానంద యూత్ సభ్యులను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సీతారాములు, మాజీ సర్పంచ్ కొండారెడ్డి, సీఐ ప్రతాప లింగం, ఎస్సై సంజీవరెడ్డి, న్యాయవాది ఉయ్యాల నరసయ్య, మాజీ ఎంపీటీసీ ఆయిద్వా, జిల్లా కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి, గణేష్ తో పాటు గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.