andhrapradesh
అద్దంకిలో జోరందుకున్న టీడీపీ ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన.
సూర్య న్యూస్ అద్దంకి.
24వ వార్డులో చైర్మన్ తెదేపా అభ్యర్థి కాకాని అశోక్, 6వ వార్డులో ఆయన సతీమణి పావని పర్యటన.
అద్దంకి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న కాకాని అశోక్ 24 వార్డులోనూ, ఆయన సతీమణి పావని ఆరో వార్డులోను ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఇంటి ఇంటికి పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. అందరిని పలకరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, మున్సిపాలిటీ అభివృద్ధికిై తమ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. 24వ వార్డులో అభ్యర్థితో పాటు సంధి రెడ్డి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు ఎం జె స్టాలిన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పౌలు, స్వరాజ్, నరేంద్ర, ఏడుకొండలు, బచ్చల వాసు, అరిగెల నాగరాజు, నాగమ్మ తదితరులు ఉన్నారు. అదేవిధంగా ఆరో వార్డులో కాకాని పావనితో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాగులూరి తిరుపతమ్మ గోపాలకృష్ణ, మలాది రత్తయ్య మణికంఠ వెంకట్రావు శివకుమారి తదితరులు ఉన్నారు.