దసరా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ ఆర్ బాబు నాయక్
ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెల్ జర్ల గ్రామంలో దసరా పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆది వారం తొలి రోజు టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ ఆర్ బాబు నాయక్ ప్రారంభించారు. క్రీడలు యువతకు ఎంతో ఉపయోగకరమని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సర్పంచ్ బాబు నాయక్ సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదల పెంపొందించడంతో పాటు ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు యువత క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని, క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు..