BREAKING
లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి: ఒకే ఈతలో రెండు దూడల జననం. మేయర్ పదవికి ఇండిపెండెంట్ గా సోషల్ వర్కర్ దీనా గ్లాడి పోటీ తిరుపతమ్మ నామినేషన్‌లో దారపనేని తిరుపతమ్మకు పామూరు టీడీపీ నేతలు అభినందనలు కాంగ్రెస్‌కు బివిఎం శివశంకర్ రాజీనామా ముగిసిన వాలీబాల్ పోటీలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో 300 నామినేషన్లు స్వీకరణమూడు రోజుల్లో 300 నామినేషన్లు.. 282 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం! *పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు** గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ --ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా! --వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దుర్గామాత రూపంలో ఏడుపాయల వన దుర్గమ్మ

Select Suryaa Now
దుర్గామాత రూపంలో ఏడుపాయల వన దుర్గమ్మ

పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గాభవాని అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం నాడు అమ్మవారు దుర్గామాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో అత్యంత సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక మండపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.