కలసపాడులో ఘనంగా వాసవీమాత నవరాత్రి ఉత్సవాలు
కలసపాడు మేజర్ న్యూస్: కడప జిల్లా బద్వేల్, కలసపాడు మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం మహిషాసురమర్దిని అలంకారంలో వాసవీమాత భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో సామూహిక లక్ష కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కె. సుదర్శన్, జక్కా సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్: రాజు, కలసపాడు, బద్వేల్, కడప జిల్లా