BREAKING
మన్నెగూడ ప్రముఖ్ టౌన్ షిప్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి: ఒకే ఈతలో రెండు దూడల జననం. మేయర్ పదవికి ఇండిపెండెంట్ గా సోషల్ వర్కర్ దీనా గ్లాడి పోటీ తిరుపతమ్మ నామినేషన్‌లో దారపనేని తిరుపతమ్మకు పామూరు టీడీపీ నేతలు అభినందనలు కాంగ్రెస్‌కు బివిఎం శివశంకర్ రాజీనామా ముగిసిన వాలీబాల్ పోటీలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో 300 నామినేషన్లు స్వీకరణమూడు రోజుల్లో 300 నామినేషన్లు.. 282 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం! *పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు** గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కడప 27వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా వెంకట శివ నామినేషన్ దాఖలు

Select Suryaa Now
కడప 27వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా వెంకట శివ నామినేషన్ దాఖలు

కడప 27వ డివిజన్‌ సిపిఐ  అభ్యర్థిగా ఎన్. వెంకట శివ నామినేషన్ దాఖలు.

నల్లకోటు ధరించి, భారత రాజ్యాంగం చేతబట్టి నామినేషన్ కేంద్రానికి రాక..

కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కడప నగర కార్యదర్శి, అడ్వకేట్‌ ఎన్. వెంకట శివ ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఆదివారం గాంధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రంలోని ఆర్ ఓ కు వారు తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా ఎన్. వెంకట శివ ఎర్రముక్కపల్లె సర్కిల్‌ నుంచి సీపీఐ, వామపక్ష ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. న్యాయవాదిగా తన వృత్తికి ప్రతీకగా నల్లకోటు ధరించి, ప్రజాస్వామ్యానికి, పౌరుల హక్కులకు, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతబట్టి నామినేషన్‌ కేంద్రానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రజా సమస్యల పరిష్కారం, పేదలు, కార్మికులు, నిరుపేద మధ్యతరగతి ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలన లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర,సిపిఐ అభ్యర్థి ఎన్. వెంకట శివ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష ,ప్రజాసంఘాల నాయకులు అడ్వకేట్ సంపత్ కుమార్, సి ఆర్ వి ప్రసాద్, సుబ్బరాయుడు అంకన్న ఓబులేసు జయవర్ధన్ జగదీష్  సిపిఐ నాయకులు సుబ్రహ్మణ్యం  కేసి బాదుల్లా, చంద్రశేఖర్, శంకర్ నాయక్, బ్రహ్మం, మల్లికార్జున, భాగ్యలక్ష్మి లింగన్న , నారాయణ, శివ నాగేంద్ర, ఈశ్వరయ్య, సుబ్బరాయుడు, గడ్డం శీను, రాముడు, దస్తగిరమ్మ, పెంచలయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

 కడప, రిపోర్టర్, వేణు.