BREAKING
స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్ కలసపాడులో ఘనంగా వాసవీమాత నవరాత్రి ఉత్సవాలు అద్దంకిలో జోరందుకున్న టీడీపీ ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పార్టీలు సహకరించాలి. దుర్గామాత రూపంలో ఏడుపాయల వన దుర్గమ్మ దసరా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ ఆర్ బాబు నాయక్ ఎస్పీ రాం కుమార్ దంపతులకు ఘన సన్మానం నంది గుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు.. * జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నల్లంపల్లి లో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న సర్పంచ్ రాధిక ఏసయ్య కోడి పందాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్ ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ఎలికట్టలో అంభ భవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు కుశాలపురంలో ఘనంగా కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన కడప 27వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా వెంకట శివ నామినేషన్ దాఖలు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

Select Suryaa Now
బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత
సూర్య, భీమ్‌గల్  భీమ్‌గల్ మండల కేంద్రంలో ఇటీవల సుధాకర్ (60) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి బలవన్మరణం చెందగా, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. భీమ్‌గల్ తహసిల్దార్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుని సతీమణి సరోజ, కుమారుడు శ్రీనివాస్ లకు ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠిల చేతుల మీదుగా రూ. 5లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,  మున్సిపల్ చైర్మన్ నాగమణి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,బాల్కొండ  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహసీల్దార్ కిరణ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.