నగరాభివృద్ధికి మరింత కృషి చేస్తా....కోలగట్ల శ్రావణి
విజయనగరం, సూర్య : నగరాన్ని మరింత అభివృద్ధి పరిచేలా కృషి చేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణి అన్నారు. స్థానిక ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం నాడు నగరంలో 5, 33, 39, 62 మరియు 42 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా కార్పొరేట్ అభ్యర్థులు కంటూమహంతి శ్రీనివాసరావు, ఎన్ని లక్ష్మణరావు, కనకల సూరప్పడు, కిల్ల భవాని యాదవ్, రెడ్ గురుమూర్తి కార్పోరేటర్ అభ్యర్థులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. రానున్న స్థానిక ఎన్నికలలో ప్రజలు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసిపి హయాంలో విజయనగరంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. గత రెండున్నర ఏళ్లలో టిడిపి ఇచ్చిన హామీలను అమ్మిన చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును వివరించారు. ప్రచార సమయంలో ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ, హారతిలిచ్చి, విజయ తిలకాన్ని దిద్ది ప్రజలు ఆశీర్వదించారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.