నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్
నెల్లిమర్ల, సూర్య : కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ ఆదివారం అట్టహాసంగా తన నామినేషన్ను దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి మైపాడ మహేశ్వరి కూడా 8వ వార్డు కౌన్సిలర్ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమం ఒక భారీ పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఘనంగా భారీ ర్యాలీ…
జనసంద్రమైన రామతీర్థం జంక్షన్
రామతీర్థం జంక్షన్లోని మైపాడ ప్రసాద్ నివాసం నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు సాగిన ర్యాలీ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓపెన్ జీప్ పై అభివాదం చేస్తూ ముందుకు సాగిన చైర్మన్ అభ్యర్థి మైపాడ ప్రసాద్. దారి పొడవునా కూటమి శ్రేణుల నినాదాలతో హోరెత్తిన వీధులు. ప్రజల నుంచి లభించిన విశేష స్పందనతో ర్యాలీ కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ,
రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, జిల్లా ఇన్చార్జి విజయ ఆనంద్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బూర్లె శ్రీధర్ తదితరులు కూటమి నాయకులందరి సమక్షంలో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, అత్యంత ఘనంగా ముగిసింది. ఈ భారీ ప్రదర్శనతో నెల్లిమర్లలో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.