BREAKING
మన్నెగూడ ప్రముఖ్ టౌన్ షిప్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి: ఒకే ఈతలో రెండు దూడల జననం. మేయర్ పదవికి ఇండిపెండెంట్ గా సోషల్ వర్కర్ దీనా గ్లాడి పోటీ తిరుపతమ్మ నామినేషన్‌లో దారపనేని తిరుపతమ్మకు పామూరు టీడీపీ నేతలు అభినందనలు కాంగ్రెస్‌కు బివిఎం శివశంకర్ రాజీనామా ముగిసిన వాలీబాల్ పోటీలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో 300 నామినేషన్లు స్వీకరణమూడు రోజుల్లో 300 నామినేషన్లు.. 282 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం! *పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు** గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు
 సూర్య కామారెడ్డిజిల్లా ప్రతినిధి , కామారెడ్డి జిల్లా లో వైభవంగా మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. రంగురంగుల పూలతో ఏర్పాటు చేసిన బతుకమ్మలను ప్రధాన చౌరస్తాలలో ఏర్పాటుచేసి బతుకమ్మ పాటలను పాడుతూ మహిళలు అలరించారు. ఏడాదిలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించిన మహిళలు చివరి రోజు పెద్ద బతుకమ్మ పండుగ తో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో, గ్రామాల్లో పట్టణాల్లో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూవులతో బతుకమ్మలను పేర్చారు.రకరకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలను అలంకరించారు. పోటాపోటీగా బతుకమ్మలను అలంకరించారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి గ్రామాల్లోని కూడలిలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు.
అనంతరం బతకమ్మలను తీసుకొని వెళ్లి  సమీప చెరువులలో, కాలువలలో, ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన నీటి గుంతలు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.అనంతరం అక్కడే తమ వెంట తీసుకువెళ్లిన సద్దులను సహా పంక్తి భోజనాలుగా స్వీకరించారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సతీమణి మంజుల రెడ్డి ప్రత్యేకంగా బతుకమ్మను పేర్చి గ్రామ కూడలిలో ఉంచి బతుకమ్మ ఆటలు ఆడారు. మాచారెడ్డి వేల్పుగొండలో, సదస్సు నగర్ మండల మండల కేంద్రంలో,, జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో పాటు గ్రామ గ్రామాన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సతీమణి మంజులారెడ్డి  మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గ్రామానికి వచ్చి బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.