BREAKING
అది పొరపాటే.. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్ కలసపాడులో ఘనంగా వాసవీమాత నవరాత్రి ఉత్సవాలు అద్దంకిలో జోరందుకున్న టీడీపీ ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పార్టీలు సహకరించాలి. దుర్గామాత రూపంలో ఏడుపాయల వన దుర్గమ్మ దసరా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ ఆర్ బాబు నాయక్ ఎస్పీ రాం కుమార్ దంపతులకు ఘన సన్మానం నంది గుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు.. * జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నల్లంపల్లి లో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న సర్పంచ్ రాధిక ఏసయ్య కోడి పందాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్ ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ఎలికట్టలో అంభ భవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు కుశాలపురంలో ఘనంగా కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన కడప 27వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా వెంకట శివ నామినేషన్ దాఖలు

సామూహిక వివాహానికి దరఖాస్తుల ఆహ్వానం -వచ్చే ఏడాది మార్చి 31న 516 జంటలకు ఉచిత సామూహిక వివాహం -బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏకవీర సేవా ఫౌండేషన్ -మంగళ సూత్రాలు వివాహ మహోత్సవ సామాగ్రి ఉచితంగా పంపిణీ -ఉచిత భోజన వసతితో పాటు శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు -అర్హులైన పేద కుటుంబాలు డిసెంబర్ 31 లోపు

Select Suryaa Now
సామూహిక వివాహానికి దరఖాస్తుల ఆహ్వానం  -వచ్చే ఏడాది మార్చి 31న 516 జంటలకు ఉచిత సామూహిక వివాహం -బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏకవీర సేవా ఫౌండేషన్ -మంగళ సూత్రాలు వివాహ మహోత్సవ సామాగ్రి ఉచితంగా పంపిణీ -ఉచిత భోజన వసతితో పాటు శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు -అర్హులైన పేద కుటుంబాలు డిసెంబర్ 31 లోపు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఏకవీర సేవా ఫౌండేషన్ సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద కుటుంబాలకు అండగా నిలవాలని సదుద్దేశంతో 2027 మార్చి 31న 516 మంది పేద కుటుంబాలకు చెందిన అర్హులైన వారికి సామూహిక వివాహాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి తన స్వహస్తాలతో ఆదివారం గంగమ్మ ఆలయం సమీపంలో ఆవిష్కరించారు. 

31న ఉచిత సామూహిక వివాహ ముహూర్తం

ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతాప్ స్వామి ఆశీస్సులతో మార్చి 31 2027న బుధవారం 10:30 గంటలకు తిరుచానూరు నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ ప్రాంగణంలో ఈ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మార్చ్ 30వ తేదీ నూతన వధూవరులకు మంగళస్నానాలు, వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 31న నిర్ణీత ముహూర్తంలో సామూహిక వివాహాలు జరుగుతాయి. వివాహానంతరం నూతన వధూవరులకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వివాహ మహోత్సవం ఉచిత సామగ్రి పంపిణీ 

ఉచిత వివాహ మహోత్సవంకు ఎంపికైన వధూవరులకు వివాహానికి అవసరమైన వస్త్రాలు ఇతర సామాగ్రిని పూర్తిగా ఉచితంగా అందజేస్తారు. సంప్రదాయబద్ధమైన వైదిక పద్ధతిలో వివాహాలు నిర్వహిస్తారు. వధూవరులతో పాటు వారి బంధుమిత్రులకు వసతి, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారు.

వధూవరుల దరఖాస్తులు ఇలా 

ఉచిత వివాహ మహోత్సవానికి ఆసక్తి కలిగిన నూతన వధూవరులు నిర్దేశిత దరఖాస్తు పరాన్ని నింపి వధూవరులు ఆధార్ కార్డులు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జతపరచి డిసెంబర్ 31 లోపు దరఖాస్తులను పూర్తి చేసి తమకు అందజేస్తే వాటిని పరిశీలించి అనంతరం అర్హులైన తుది జాబితా ప్రకటిస్తారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం కాకుండా, హిందూ సంప్రదాయాల ప్రకారం తమ పిల్లల వివాహాలను వైభవంగా నిర్వహించుకోవాలనే సత్సంకల్పంతో ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని అర్హులైన వధూవరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు ఏకవీర ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహణ సభ్యులు సూర్య రాట్నాల ఫోన్ నెంబర్ 9533357997ను సంప్రదించాలన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్