ఆనవరంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 40 కుటుంబాలు!
బాడంగి, సూర్య : బాడంగి మండలం ఆనవరం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు గా 40 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) సమక్షంలో ఆదివారం ఈ చేరికలు జరిగాయి. బొబ్బిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేబీ నాయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయా కుటుంబాల సభ్యులు తెలిపారు. ఆనవరం గ్రామంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తూ, ఎమ్మెల్యే బేబీ నాయన నాయకత్వంలో పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వాకాడ ఎర్రంనాయుడు, సిరికి సింహాచలం, వాకాడ సంజీవునాయుడు, బలిజిరెడ్డి రాము, సిరికి వెంకటనాయుడు, రాపాక రాము, పతివాడ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆనవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.