BREAKING
పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్ సీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థి తూముల రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు అందజేసిన కౌన్సిలర్ శాంతిరాజు నాయక్

Select Suryaa Now
పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు అందజేసిన కౌన్సిలర్ శాంతిరాజు నాయక్

మేడ్చల్ ,మేజర్ న్యూస్:ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో కౌన్సిలర్ శాంతి రాజు నాయక్ ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకుని పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. ప్రతిరోజూ తెల్లవారుజామునే విధులకు హాజరై పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను ఈ సందర్భంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ శాంతిరాజు నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంగా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే విధులకు హాజరై వీధులు, కాలనీలను శుభ్రం చేస్తూ సమాజానికి ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వారి కష్టాన్ని, సేవలను గుర్తించి దసరా పండుగ సందర్భంగా వస్త్రాలు అందజేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారు చేసే పనిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. సమాజ పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేసే కార్మికులను ప్రోత్సహించడం, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజు నాయక్ అన్నారు.

రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.