ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు-మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సూర్య, సెంటినరీకాలనీ :పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత వద్ద తొమ్మిది రోజులు మాలలు వేసుకునే వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అలాగే వారి వారి కుటుంబ సభ్యులు మరియు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. దేవతలందరూ ప్రజలపై కరుణ చూపి చల్లగా చూడాలని వారి వారి కుటుంబాలను చల్లగా ఆశీర్వదించాలని శ్రీధర్ బాబు ఆ దేవతలను కోరారు. అలాగే దసరా పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకొని కలిసి మెలిసి ఉండాలని కోరారు.